సత్యము యొక్క వెలుగులో – గ్రాలుసందేశమును సంపుటము II (ఈబుక్)
„సత్యము యొక్క వెలుగులో“ అనే గ్రంథం యొక్క మూడు సంపుటాలలో మొత్తం 168 ఉపన్యాసాలు ఉన్నాయి. అవి వాటి వరుసక్రమంలో విషయాన్ని క్రమంగా విస్తరిస్తూ సమస్త సృష్టి యొక్క సంపూర్ణ చిత్రాన్ని అందిస్తాయి.
ఈ గ్రంథంలో పొందుపరచబడిన ఉపన్యాసాలు 1923 నుండి 1938 సంవత్సరాల మధ్యలో వ్రాయబడినా, నేటివరకు అవి తమ అర్థాన్ని కోల్పోలేదు. అవి సృష్టి శాసనాల ఆధారంగా ఒక సమగ్రమైన విశ్వవివరణను అందిస్తాయి. ఆ వివరణ పాఠకునికి, జీవితంలోని మర్మమైయున్న అవినాభావ సంబంధాలను గుర్తించునట్లు చేస్తుంది మరియు తద్వారా విలువైన జీవితసహాయాలను అందిస్తుంది.
„సత్యము యొక్క వెలుగులో“ అనే గ్రంథం ముఖ్యంగా ఎందువల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం
పొందిందంటే, అది మానవాళి యొక్క గొప్ప ప్రశ్నలకు నిస్సంశయమైన సమాధానాలను అందిస్తుంది, ఉదాహరణకు జీవితం యొక్క ఉద్దేశం గురించి, ప్రారబ్ధంలో న్యాయత గురించి లేక మరణం తరువాత జీవితం గురించి, ఇత్యాది. ఇంతవరకు అది 20 భాషలలోనికి అనువదించబడింది మరియు 90 దేశాలలో పొందబడగలదు.
పాఠకునికి నిజమైన జీవితాన్ని చేరువగా తెచ్చుట, అతని వ్యక్తిత్వ అభివృద్ధికి విలువైన ప్రేరణలను ఇచ్చుట మరియు అతన్ని దేవునిగుర్తింపును తనలో కలిగియున్న గుర్తింపుమార్గంపై నడిపించుట రచయిత యొక్క ఒక ఉద్దేశమైయుండింది. „సత్యము యొక్క వెలుగులో“ అనే ఈ గ్రంథంలో పొందుపరచబడిన ఉపన్యాసాలు ఆ ప్రక్రియలో ఒక „దీపము మరియు దండమువలే“ ఉపయోగపడవలెను, మతపరమైన ఆలోచనతో లేక మనిషి యొక్క మతంతో సంబంధంలేకుండా. అబ్ద్-రు-షిన్ ఒక మతాన్ని కాని ఒక తెగను కాని లేక మతసంఘాన్ని కాని స్థాపించగోరలేదు.
„సత్యము యొక్క వెలుగులో“ అనే ఈ గ్రంథంలోని వివరణలు సరలమైన, అర్థమయ్యే, సృష్టి శాసనాలను తమ ఆధారంగా కలిగియున్నాయి. అవి బాహ్యలోకంలో, అదే విధంగా జీవాత్మ యొక్క అంతరంగిక జీవితంలో పనిచేస్తాయి. ఆ వివరణలు విలక్షణమైన మానవ అనుభవాలను సంభోదిస్తాయి, బలాలను మరియు బలహీనతలను చూపుతాయి మరియు మర్మంగావున్న లోటుపాట్లను, అంతేకాక అనుదినజీవితం ఆత్మీయ అభివృద్ధి కొరకు అందించే చాలా అవకాశాలను సూచిస్తాయి. పాఠకుడు దానితో, ఆ ఉపన్యాసాలలోని విషయాన్ని తన స్వంత జీవితంలో తిరిగి కనుగొనుటకు మరియు దానిని సత్యమైనదానిగా గుర్తించుటకు అవకాశాన్ని కలిగియుంటాడు. ఆ విధంగా, ఆత్మీయమైన, అంతఃకరణానుభూతులతోకూడిన అనుభవాలు, వస్తుగత-తార్కిక నిగమనములతోపాటు ఒక సమగ్రమైన, పూర్ణరూపాత్మకమైన లోకచిత్రంగా ఏర్పడగలవు. దానిలో విజ్ఞానశాస్త్ర సంబంధమైన మరియు మతసంబంధమైన సత్యాన్వేషణకు మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు.
„సత్యము యొక్క వెలుగులో“ అనే ఈ గ్రంథము ఖచ్చితంగా సర్వసాధారణం కాని „గ్రాలుసందేశము“ అనే ఉపశీర్షికను కలిగియిన్నది. „గ్రాలు“ అనే పదంతో మనుష్యులు నేడు తరచుగా పురాణ కథల ద్వారా, ఐతిహ్యముల ద్వారా మరి ముఖ్యంగా కళ యొక్క రచనల ద్వారా సంక్రమించిన కాంక్ష-చిత్రాలు మరియు దర్శనములతో జోడిస్తారు. ఈ సంక్రమణలు వాస్తవంగా ఉనికిలోవున్న దానిని ధృవీకరిస్తాయని అబ్ద్-రు-షిన్ వివరిస్తాడు. అది, సమస్త సృష్టి ఉనికిలో కొనసాగుటకు మరియు దాని నిర్వహణకు అత్యంత ప్రధానమైనది. అదే సమయంలో „సందేశము“ అనే పదము, ఉపన్యాసాల ద్వారా బోధించబడే జ్ఞానం యొక్క ప్రత్యేకమైన, ఉన్నతమైన మూలాన్ని సూచిస్తుంది.
నిజానికి „సత్యము యొక్క వెలుగులో“ అనే ఈ గ్రంథం చూపే మార్గం సంపూర్ణంగా సులువైనది. దానికి గుప్తమైన దానితో కాని లేక అటువంటి దాని గుప్తవైఖరితో కాని ఎటువంటి సంబంధం లేదు. అయితే అది, అసలైన క్రీస్తు బోధవలే గణనీయమైన అవశ్యాభ్యర్థనలను పాఠకుని ఎదుట ఉంచుతుంది. కాగా కేవలం స్వంత, నిశ్పక్షపాతమైన, వస్తుగతమైన ఆలోచనాసరళియే కాక అతి ముఖ్యంగా „మంచి కొరకు దృఢమైన సంకల్పం“ ప్రోత్సాహించ బడవలెను. తన స్వంత విషయంలో మరియు తన పొరుగువాని సేవలో మనిషి చేసే ఈ కృషి అతన్ని ఆత్మీయ అభివృద్ధికి నడిపించగలదు.
గ్రాలుసందేశము సవివరమైన సమాధానాలు అందించే ముఖ్యమైన చాలా విషయాలలో కొన్ని ఇక్కడ పేర్కొనబడ్డాయి:
• బాధ్యత మరియు ప్రారబ్ధము/కర్మ
• మరణము మరియు పునరావృతమయ్యే భూలోక జీవితాలు/పునర్జన్మ
• ఆదిపాపము మరియు వారసత్వ పాపము
• ఈవలి- మరియు ఆవలిలోకాల సంయుక్త దర్శనము
• దేవుని ప్రేమ మరియు కృప
• శరీరము, జీవాత్మ మరియు ఆత్మ
• దైవకుమారుడు మరియు మనుష్యకుమారుడు
1. బాధ్యత
ఈ ప్రశ్న ఎల్లప్పుడు మొదటి వాటిలో ఒకటైయుంటుంది. ఎందుకంటే మనుష్యులలో అత్యధిక సంఖ్యాకులు అతి ఇష్టంగా ప్రతివిధమైన బాధ్యతను తమ నుండి త్రోసివేసి, తమపై కాకుండా ఏదైనా ఇతర దానిపై మోపుటకు ఆశిస్తారు. అది స్వంత అవమానమైయున్ననూ, దానిని వారు పట్టించుకోరు. ఈ విషయాలలో వారు నిజంగా చాలా దీనులు మరియు నిరాడంబరులైయుంటారు, అయితే తద్వారా మరింత విలాసంగా మరియు అనైతికంగా జీవించగల్గుటకు మాత్రమే.
ఇతర మనుష్యులకు హాని కలిగించినా దండి౦చబడకుండా తన కోర్కెలన్నింటినీ నెరవేర్చుకొనుట మరియు నిర్మొహమాటంగా తన తృష్ణలన్నింటినీ తీర్చుకొనగల్గుట, నిజంగా ఎంత సుందరంగా ఉంటుందో! భూలోక శాసనాలు అత్యవసరమైన సందర్భంలో దాటవేయనిస్తాయి మరియు అవరోధములను తప్పించుకోనిస్తాయి. ఒడుపుగలవారు వాటి ముసుగులో ఎంతో విజయవంతంగా తమకు అందినంత జవురుకొనవచ్చు, ఎటువంటి నీతి-పరీక్షను తట్టుకొనబోని ఎన్నో ఇతర కార్యాలను చేయవచ్చు. అట్లు చేస్తూకూడా వారు తరచుగా అతి విశేషమైన సమర్థులు అనే ప్రతిష్టను అనుభవిస్తుంటారు.
ఈ విధంగా ఒకింత గడసరితనంతో నిజానికి చాలా కులాసాగా తన స్వంత అభిప్రాయాలను అనుసరించి జీవించవచ్చు, … ఒకవేళ ఎక్కడో ఏదో లేనట్లైతే, అది అంతరాత్మలో అసౌకర్యమైన భావనను కలిగించకపోతే, చాలా విషయాలు నిజానికి స్వంత కోరిక రూపొందించిన దానికి భిన్నంగా ఉండవచ్చునని అప్పుడప్పుడు అశాంతి కలుగనట్లైతే.
అది నిజంగానే ఆ విధంగా ఉన్నది! వాస్తవికత గంభీరమైనది మరియు కఠిమైనది. మనుష్యుల కోరికలు ఈ విషయంలో ఎటువంటి క్రమభంగాన్ని కలుగజేయలేవు. “మనిషి ఏమి విత్తునో, అదే పంటను పలుమార్లు కోయును!” అనే శాసనం స్థిరమైనదైయుంటుంది.
ఈ కొద్ది మాటలలో చాలా ఇమిడియున్నది. అవి అనేకులు తలంచే దానికంటే చాలా ఎక్కువ వ్యక్తపరుస్తాయి. సృష్టిలో ఇమిడియున్న చర్య-ప్రతిచర్య అనే వాస్తవమైన ప్రక్రియకు చాలా నిశితంగా మరియు ఖచ్చితంగా అవి సరిపోతాయి. దానికి మరియే ఇతర మరింత అనుయోగ్యమైన అభివ్యక్తమును కనుగొనగల్గుట సాధ్యం కాదు. ఏ విధంగా పంట ఒక విత్తనానికి పలుమార్లు ఎక్కువ పండిస్తుందో, అదే విధంగా దేనినైతే మనిషి తన అంతరాత్మలో తన సంకల్పం ప్రకారం ఉత్పన్నం చేస్తాడో మరియు బయటకు పంపుతాడో, అది ఎల్లప్పుడు అనేకంగా అభివృద్ధి చెందినదై తిరిగా అతన్ని మొత్తుతుంది.
అనగా, మనిషి తాను చేసే దానియంతటికి ఆత్మీయబాధ్యతను వహిస్తాడు. ఈ బాధ్యత, కార్యమును పూర్తి చేసినప్పుడు కాదు, కాని నిర్ణయం తీసుకొన్నప్పుడే మొదలవుతుంది, ఎందుకంటే అది, కేవలం నిర్ణయం యొక్క పరిణామం మాత్రమే కాబట్టి. మరియు నిర్ణయం తీసుకొనుట మన:పూర్వకమైన సంకల్పము ఉత్పన్నమగుటయే!
ఈవలిలోకానికి మరియు ఆవలిలోకం అని పిలువబడే దానికి మధ్య విభజన లేదు, కాని అంతయూ ఒకే ఒక్క గొప్ప ఉనికియైయున్నది. మనుష్యులకు గోచరమైన మరియు అగోచరమైన మహాగొప్ప సృష్టి అంతయూ అద్భుతమైన ప్రావీణ్యంతో, ఎప్పుడూ విఫలం కాని ఒక యంత్రంవలే ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తూ ఉన్నది. వేర్వేరుగా పనిచేయదు. ఏకరూపమైన శాసనాలు దానియంతటికీ ఆధారమైయున్నవి, అవి నరాలపోగులవలే అంతటిలో వ్యాపించియున్నవి, అంతటినీ సంధించియున్నవి మరియు నిత్యమైన చర్య-ప్రతిచర్య ద్వారా తమను పరస్పరం ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి!
ఇక పాఠశాలలు మరియు చర్చిలు, స్వర్గమును మరియు నరకమును గురించి, దేవుణ్ణి మరియు సైతానును గురించి మాట్లాడినప్పుడు అది సరియైనదే. కాని మంచి మరియు చెడు శక్తులను గురించి వివరించటం మాత్రం తప్పు. అది ఆసక్తితో వెదుకు ప్రతివానినీ తప్పులలోనూ మరియు అనుమానమునలలోనూ తప్పక పడవేయవలసియుంటుంది. కాగా ఎక్కడ రెండు శక్తులు ఉంటాయో, అక్కడ తార్కికంగా ఇద్దరు ప్రభువులు కూడా, అనగా, దాని ప్రకారంగా ఇద్దరు దేవుళ్లు ఉండవలసియుంటుంది, ఒక మంచివాడు ఒక చెడ్డవాడు.
కాని అది ఆ విధంగా లేదు!
ఒకే ఒక్క సృష్టికర్త ఉన్నాడు. ఒకే ఒక్క దేవుడు అందువల్ల శక్తి కూడా ఒక్కటే ఉన్నది. అది ఉనికిలోవున్న సమస్తం ద్వారా ప్రవహిస్తుంది, దానిని ఉత్తేజపరుస్తుంది మరియు ప్రోత్సాహిస్తుంది!
ఈ పవిత్రమైన, సృజనాత్మకమైన దేవుని శక్తి నిరంతరం సృష్టియంతటి ద్వారా ప్రవహిస్తుంది, దానిలో ఇమిడియున్నది మరియు దాని నుండి విడదీయబడలేదు. దానిని సర్వత్రా కనుగొనవచ్చు: గాలిలో, ప్రతి నీటిబిందువులో, పెరిగే శిలలో, ఎదుగుటకు తపించే మొక్కలో, జంతువులో, సహజంగా మనిషిలో కూడా. అది లేకుండా ఏదియూ లేదు.
మరియు అంతటిలో నిండాపారినట్లే అది మనుష్యుని ద్వారా కూడా ఎడతెగక ప్రవహిస్తూవుంటుంది. కాగా, అతడు ఒక కటకాన్ని పోలినట్లు రూపొందిచబడ్డాడు. ఒక కటకం ఏ విధంగా తనద్వారా ప్రవహించే సూర్యకిరణాలను సమీకరించి, ఏకీకరించి ప్రసరింపజేస్తుందో, తద్వారా వేడెక్కించే ఆ కిరణాలు ఒకే బిందువుపై కేంద్రీకరించబడి కమిల్చి, నిప్పురాజబెట్టి మంటను రేపుతాయో, అదే విధంగా మనిషి, తన ప్రత్యేకమైన సంగతత్వం కారణంగా తనద్వారా ప్రవహించే సృష్టిశక్తిని తన అంత:కరణానుభూతి ద్వారా సమీకరిస్తాడు. దానిని తన ఆలోచనల ద్వారా సాంద్రీకరించి బయటకు పంపుతాడు.
అనగా, ఈ అంత:కరణానుభూతి యొక్క స్వభావానికి మరియు దానితో జతపరచబడియున్న ఆలోచనలకు అనుగుణంగా అతడు స్వయంచాలకంగా పనిచేసే సృజనాత్మకమైన దేవునిశక్తిని, మంచి లేక చెడు కార్యములకు మళ్లిస్తాడు!
మరియు అదే మనిషి తప్పక భరించవలసిన బాధ్యత! దానిలోనే అతని స్వతంత్ర సంకల్పం కూడా ఉన్నది!
మీరు, ఎవరైతే సరియైన మార్గమును కనుగొనుటకు తరచుగా ఎంతో ఆరాటంతో వెదుకుతుంటారో, ఎందుకు మీరు దానిని అంత కష్టతరం చేసుకుంటారు? సంపూర్ణ సరళత్వంలో మీరు ఆ చిత్రాన్ని ఊహించుకోండి, ఏ విధంగా సృష్టికర్త యొక్క స్వచ్ఛమైన శక్తి మీ ద్వారా ప్రవహిస్తుందో, మీరు మీ ఆలోచనల ద్వారా దానిని మంచి లేక చెడు దిశలలో మళ్లిస్తారో. తద్వారా మీరు ప్రయాసలేకుండా మరియు ఎక్కువగా ఆలోచించకుండా సమస్తమునూ కలిగియుంటారు!
ఈ బ్రహ్మండమైన శక్తి, మంచిని ఉత్పన్నం చేస్తుందో లేక చెడును ఉత్పన్నం చేస్తుందో, మీ యొక్క సామాన్యమైన అంత:కరణానుభూతిపైనా మరియు ఆలోచనలపైనా ఆధారపడియున్నది. ఎటువంటి ప్రోత్సాహించే లేక వినాశమును కలుగజేసే శక్తి మీకు తద్వారా ఇవ్వబడిరదో ఆలోచించండి!
మీ నుదిటిపై చమటలు పట్టేవరకు మీరు శ్రమపడవలసిన అవసరం లేదు. సాధ్యమైన మరియు అసాధ్యమైన శారీరిక మరియు ఆత్మీయ వక్రగతులతో మీ నిజమైన ఆత్మీయ ఉన్నతికి పూర్తిగా అర్థంలేని స్థాయిని చేరుటకు గుప్తాభ్యాసము అను పిలువబడే దానికి బలవంతంగా అంటిపెట్టుకొనియుండుటకు మీకు అవసరం లేదు!
సమయాన్ని వ్యర్థంచేసే ఈ అల్పమైన చేష్టలను మానివేయండి, అవి ఇప్పటికే, అతి తరచుగా, బాధతో క్రుంగదీయుచున్నవి. అవి మఠములలోని పూర్వపు స్వీయ-దండన మరియు శరీరశోషణముల వంటివే తప్ప మరేమీ కాదు. అవి, మీకు అంతే తక్కువ లాభామును చేకూర్చగలిగే వాటి యొక్క మరియొక రూపమైయున్నవి.
గుప్తవిద్య యొక్క గురువులు మరియు శిష్యులు అని పిలువబడేవారు ఈ మాటల యొక్క అత్యంత సరియైన భావంలో ఆధునిక పరిసయ్యులైయున్నారు! వారు నజరేయుడైన యేసు కాలంలోని పరిసయ్యుల యొక్క అతి ఖచ్చితమైన ప్రతిబింబమైయున్నారు.
మీ యొక్క సాధారణమైన, మంచిని ఆశించే అంత:కరణానుభూతి మరియు ఆలోచనల ద్వారా మీరు, ఒకే ఒక్క అతిశక్తివంతమైన సృష్టిశక్తిని, ప్రయాసలేకుండా నడిపించుటకు సమర్థులైయున్నారని, స్వచ్ఛమైన ఆనందంలో గుర్తుంచుకోండి. ఆ శక్తి అప్పుడు, సరిగ్గా మీ యొక్క అంత:కరణానుభూతి మరియు మీ ఆలోచనాసరళి యొక్క స్వభావం ప్రకారం పనిచేస్తుంది. అది స్వతహాగా పనిచేస్తుంది, మీరు దానిని కేవలం నడిపించవలసియుంటుంది.
ఇది సంపూర్ణ సరళత్వంలో మరియు స్పష్టతలో జరుగుతుంది! దానికి ఎటువంటి పాండిత్యమూ అవసరం లేదు, కనీసం చదువుట, వ్రాయుట కూడా. మీలో ప్రతి ఒక్కరికీ అది సమపాళ్లలో ఇవ్వబడిరది! దానిలో ఎటువంటి వ్యత్యాసం లేదు.
ఏలాగున ఒక బిడ్డ, మీటతో ఆడుతూ అపారమైన ఫలితాలను కలుగజేసే విద్యుత్తును ప్రసరింపజేయగలదో, అదే విధంగా మీకు మీ యొక్క సాధారణమైన ఆలోచనల ద్వారా దైవశక్తిని నడిపించుటకు అనుగ్రహించబడిoది.
దానిని మీరు మంచికొరకై వినియోగించిన వెంటనే ఆ విషయాన్ని గురించి మీరు సంతోషించవచ్చు, గర్వించవచ్చు! కాని మీరు దానిని అనవసరంగా వ్యర్థం చేసినప్పుడు లేక అపవిత్రమైన వాటికొరకు వాడినప్పుడు భయంతో వణకండి! ఎందుకంటే సృష్టిలో ఇమిడియున్న పరస్పర-శాసనముల నుండి మీరు తప్పించుకోలేరు. మీరు ఒకవేళ అరుణరాగపు రెక్కలు కలిగియుండిననూ, ఎవరి శక్తిని మీరు ఆ విధంగా దుర్వినియోగం చేశారో, ఆ ప్రభువు యొక్క చేయి, స్వయంచాలకంగా పనిచేసే పరస్పరచర్య ద్వారా మిమ్ములను మొత్తుతుంది, మీరు మిమ్ములను ఎక్కడ దాచుకొనవలెనని ఆశించియుండినా కూడా.
చెడు కూడా మంచిలాగే అదే పవిత్రమైన దైవశక్తితో కలిగించబడుతుంది!
ప్రతి ఒక్కరికు ఇవ్వబడిన ఏకరూపమైన దేవునిశక్తి ఈ విధంగా వినియోగించగల్గుటలోనే బాధ్యత ఇమిడియున్నది, దానినుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. అందువల్ల ప్రతి అన్వేషకుడిని ఉద్దేశించి నేను పిలుపునిస్తున్నాను:
“నీ ఆలోచనల అంతికను స్వచ్ఛంగా ఉంచుకొనుము, తద్వారా నీవు శాంతిని కలుగజేస్తావు మరియు సంతోషిస్తావు!”
అజ్ఞనులారా, బలహీనులారా, ఉత్సాహించండి. కారా బలవంతులకు ఇవ్వబడినట్లే మీకు కూడా అదే శక్తి ఇవ్వబడియున్నది! అందువల్ల మీకై మీరు దానిని కష్టతరం చేసుకోవద్దు. పవిత్రమైన, స్వయంగా-సృష్టించే దేవునిశక్తి మీ ద్వారా కూడా ప్రవహిస్తుందనియూ, మనుష్యులుగా మీరు కూడా ఈ శక్తికి, మీ అంతరంగిక అంత:కరణానుభూతుల స్వభావం ద్వారా, అనగా మంచిని అదే విధంగా చెడును, వినాశమును లేక అభివృద్ధిని, సంతోషమును లేక దు:ఖమును కలుగజేసే మీ స్వసంకల్పం ద్వారా, ఒక ఖచ్చితమైన దిశను సూచించుటకు సమర్థులనియూ మరువవద్దు!
ఒకే ఒక్క ఈ దేవునిశక్తి ఉన్నందున, ప్రతి గంభీరమైన తుదిపోరాటంలో చీకటి వెలుగునుండి మరియు చెడు మంచినుండి ఎందుకు వెనుకకు తగ్గవలసియుంటుందనే మర్మము దానితో విశదమవుతుంది. దేవునిశక్తిని మీరు మంచివైపుకు మళ్లించినప్పుడు అది దాని మూలమైన స్వచ్ఛతలో మసకబారదు మరియు తద్వారా మరింత బలమైన శక్తిని అభివృద్ధిచేస్తుంది. అయితే, అదే సమయంలో, మలినత్వంలోనికి మళ్లించబడినప్పుడు అది మసకబారుట ద్వారా బలహీనపడుతుంది. ఆ కారణంగా తుదిపోరాటంలో శక్తి యొక్క స్వచ్ఛత కార్యసాధకంగా పనిచేస్తుంది మరియు నిర్ణయాత్మకమైయుంటుంది.
ఏది మంచో, ఏది చెడో ఒక్క మాట కూడా పలుకబడకుండానే ప్రతి ఒక్కరికీ తమ వేలిచివరలవరకు తెలిసియుంటుంది. దీని గురించి దీర్ఘాలోచనచేయుట కేవలం అయోమయంలో పడవేస్తుంది. నిస్తేజమైన దీర్ఘాలోచన అంటే శక్తిని వృధాచేయుటయే, అది ఒక ఉబివలే, జిగటగల బురదవలే, దానికి అందిన వాటినన్నింటినీ చచ్చుపడజేస్తూ చుట్టివేసి, ఊపిరి ఆడకుంగా చేస్తుంది. అయితే తారుణ్యమైన ఉల్లాసము దీర్ఘాలోచన యొక్క సమ్మోహమును ఖండిస్తుంది. బాధపడుటకు మరియు కృంగియుండుటకు మీకు అవసరం లేదు!
ఏ క్షణంలోనైనా మీరు ఔన్నత్యానికి నడిపించే దారిపై పోవుటను ప్రారంభించవచ్చు మరియు గతాన్ని సరిదిద్దవచ్చు, అది ఏదైనా సరే! దేవునిశక్తి ఎల్లప్పుడూ మీ ద్వారా ప్రవహిస్తుందనే ప్రక్రియను తలచుకొనుటకంటే ఎక్కువ ఏమీ మీరు చేయవద్దు, అప్పుడు మీకు మీరే ఈ పవిత్రతను చెడు ఆలోచనల యొక్క మలినమైన పరీవాహములలోనికి మళ్లించుటకు వెనుకాడతారు, ఎందుకంటే మీరు, అదే విధంగా, ఏ మాత్రం కష్టపడకుండా అత్యున్నతమును, అత్యంత ఉదాత్తతను చేరుకోగలరు. మీరు కేవలం మళ్లించితే చాలు, అప్పుడు శక్తి తానంతట అదే మీరు ఆశించిన దిశలో పనిచేస్తుంది.
తద్వారా మీరు సంతోషమును లేక దు:ఖమును మీచేతిలోనే కలిగియున్నారు. అందువల్ల మీ తలను గర్వంగాను మరియు మీ నుదుటిని చాటువేయకుండా మరియు ధైర్యంగా పైకెత్తండి. మీరు పలిస్తేకాని చెడు మీ దగ్గరకు రాలేదు! మీరు ఏ విధంగా ఆశిస్తారో, అదే విధంగా మీకు జరుగుతుంది!
| ISBN | 978-3-87860-670-3 |
|---|---|
| Höfundur | అబ్ద్-రు-షిన్ |
| Format | .epub, .azw3 (కాపీ రక్షణ లేకుండా / DRM) |
| Tungumál | తెలుగు |
| Afhendingartími | చెల్లింపు తర్వాత అందుబాటులో ఉంది |